Header Banner

మందుబాబులకు బిగ్ షాక్.. పెరిగిన మద్యం ధరలు! ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి.!

  Mon May 19, 2025 16:02        Politics

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మందుబాబులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ లిక్కర్ దుకాణాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. ఫుల్ బాటిల్ పై రూ.40 మేర ధర పెంచుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. క్వార్టర్‌ మద్యం బాటిల్‌పై రూ.10 మేర ధర పెరగగా.. హాఫ్‌ బాటిల్‌పై రూ.20 మేర ధర పెరిగింది. కాగా.. తెలంగాణ సర్కార్‌ ఇటీవలే బీర్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు తాజాగా.. లిక్కర్‌ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే, కొన్ని బ్రాండ్లపై మాత్రమే ప్రభుత్వం ధరలు పెంచినట్లు తెలుస్తోంది.. పెరిగిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. 2020లో అప్పటి ప్రభుత్వం.. స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టింది. దాని ప్రకారం మద్యం బాటిళ్లపై సెస్‌ను పెంచారు.. అయితే.. స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ఎక్సైజ్ శాఖ మళ్లీ ఇప్పుడు పునరుద్దరిస్తూ చర్యలు తీసుకుంది.. ఈ కొత్త ఒప్పందం.. జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ లోపే మద్యం ధరలు పెంచి డిస్టిలరీలు, డిస్టిబ్యూటర్లు, సప్లై కంపెనీతో ఒప్పందాలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices